జో బైడెన్ సంచలన నిర్ణయం….ప్రపంచ దేశాలకు 50 కోట్ల

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్-బయోఎన్‍టెక్ కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి జీ7 సమావేశంలో బైడెన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. ధనిక దేశాలే మెజార్టీ వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అమెరికా ఇప్పటికే తన సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్లు వేసేసింది. అక్కడి కరోనా కేసులు కూడా భారీగా తగ్గాయి. బ్రిటన్ వెళ్లడానికి ఎయిర్‍ఫోర్స్ వన్ ఎక్కే ముందే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బైడెన్ హింట్ ఇచ్చారు.
ప్రపంచం కోసం వ్యాక్సిన్ వ్యూహం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా నా దగ్గర ఒక వ్యూహం ఉంది. త్వరలోనే ప్రకటిస్తాను అని ఆయన అన్నారు.ఈ ప్రకటన చేసే సమయంలో బైడెన్‍తో పాటు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ల కోసం లాభాలు లేని ధరను ఫైజర్‍కు అమెరికా చెల్లించనుంది. వీటిలో 20 కోట్లను ఈ ఏడాది, 30 కోట్లను వచ్చే ఏడాది ప్రపంచ దేశాలకు పంపిణీ చేయనుంది. ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్‍వో భావిస్తుండగా.. బైడెన్ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే. ప్రపంచం మొత్తం వ్యాకిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది.