ఆగస్టు 1 తరువాతే అమెరికా ప్రవేశం .. భారతీయ విద్యార్థులకు

స్టూడెంట్ వీసా కలిగిన విద్యార్థులు వారి తరగతులు ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే వారికి మాత్రమే అమెరికాలోకి అనుమతి లభిస్తుందని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ తెలిపింది. ఈ మేరకు యూఎస్ కాన్సులేట్ జనరల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఆగస్టు 1లోగా ఎఫ్ వీసా హోల్డర్లను అనుమతించలేమని తెలిపింది. ప్రస్తుత ప్రెసిడెన్సియల్ ప్రకటన ప్రకారం స్టూడెంట్ వీసా హోల్డర్లు వారి తరగతులు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యేవారే యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించగలరని పేర్కొంది. ఈ తేదీకి ముందు తరగతులు ప్రారంభమయ్యే విద్యార్థులు సదరు విద్యాసంస్థలను సంప్రదించాల్సిందిగా తెలిపింది.