నవంబర్ నుంచి వారికి మాత్రమే అనుమతి : అమెరికా
నవంబర్ నుంచి అన్ని రకాల ప్రయాణ ఆంక్షలను తొలిగించే వీలుందని అమెరికా అధికారికంగా తెలిపింది. ప్రపంచవ్యాప్త బెడద కోవిడ్‌తో పలు దేశాలు విదేశీయుల రాకలపై ఆంక్షలు విధించాయి. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకొన్న అన్ని దేశాల పౌరులను నవంబర్ నుంచి అమమతిస్తామని అమెరికా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఆ దేశం విదేశీయుల రాకపై గతేడాది ఆంక్షలు విధించింది. తర్వాత కొన్ని దేశాలకు అనుమతినిచ్చినప్పటికీ వైరస్ ఉధ్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ఇండియాతో పాటు కొన్ని దేశాలపై ఆంక్షలను అలాగే కొనసాగింది. తాజా ఆ ఆంక్షలను కూడా ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది.













