దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త విన్యాసాలు
తమ సైనిక సామర్థ్యాన్ని దక్షిణ కొరియా, అమెరికా తక్కువ అంచనా వేయొద్దని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించిన వేళ ఆ రెండు దేశాలు వైమానిక విన్యాసాలకు సిద్దమయ్యాయి. దక్షిణ కొరియా సముద్రజలాల్లో జేజూ ద్వీపం వద్ద ఈ వారమంతా విన్యాసాలు కొనసాగించనున్నాయి. అమెరికా బీ-52 అణు బాంబర్ విమానాలు ఎఫ్-22లకు కొరియా ఎఫ్-25, ఎఫ్-15 యుద్ధవిమానాలు జతకలిశాయి. దక్షిణ కొరియాలో విన్యాసాల కోసం అమెరికా ఎఫ్-22 విమానాలను రప్పించడంలో నాలుగేళ్లలో ఇదే తొలిసారి. ఈ విన్యాసాలను కూడా కిమ్ సోదరి ఎద్దేవా చేశారు.













