అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు, సైనిక విన్యాసాలకు దీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి భారీ రక్షణ విన్యాసాలను ప్రారంభించాయి. ఈ విన్యాసాలను 11 రోజుల పాటు జరగనున్నాయి. ఫ్రీడమ్ షీల్డ్ 23 అనే కంప్యూటర్ సిములేషన్‌తో పాటు వారియర్ షీల్డ్ ఎఫ్‌టీఎక్స్ అనే పేరుతో జరిగే పలు రకాలైన శిక్షణ విన్యాసాలు వీటిలో ఉంటాయని దక్షిణ కొరియా తెలిపింది. జలాంతర్గాముల నుంచి లాంచ్ చేయగల క్రూజ్ క్షిపణుల పరీక్షను ఉత్తరకొరియా నిర్వహించిన వెంటనే తాజా విన్యాసాలను యూఎస్-దక్షిణ కొరియా నిర్వహిస్తుండటం గమనార్హం.













