నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్.. నేను భారతీయురాలినైతే
జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్, ఆఫ్రికన్ అమెరికన్ నటి మేరీ మిల్బెన్ స్పందించారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ భారత పౌరురాలిని అయి ఉంటే బీహార్ సీఎం పదవికి పోటీ చేసి ఉండేదాన్నని పేర్కొన్నారు. నితీశ్ వ్యాఖ్యల తర్వాత దైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాలి. బీహార్ ముఖ్యమంత్రిగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలి. నేను భారతీయురాలినైతే బీహార్‌కు వెళ్లి ముఖ్యమంత్రిగా పోటీ చేసేదాన్ని. బీహార్ ప్రజలారా, భారత ప్రజలారా, మహిళలకు ఓటు వేసే శక్తిమీకుంది. మార్పునకు ఓటువేసే శక్తి మీకు ఉంది. దైర్యవంతురాలైన మహిళ బీహార్ సీఎంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని నేను కోరుతున్నా. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు ఓటు వేసి మార్పు తీసుకురావాలి అని ఆమె పేర్కొన్నారు.













