ఆ వివరాలను భారత్ తో పంచుకున్న అమెరికా
ఇటీవల అమెరికా సహా పలు దేశాల గగనతలంపై ఎగిరిన చైనా నిఘా బెలూన్‌కు సంబంధించిన వివరాలను భారత్‌తో పంచుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఆ వివరాలను భారత్‌తో పాటు మరికొన్ని మిత్ర దేశాలతో కూడా పంచుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్స్ కోప్ ఇండియా 23 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత వాయుసేన చీఫ్ వీఆర్ చౌద్రీ, అమెరికాకు చెందిన పసిఫిక్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్బాష్ భేటీ అయ్యారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలపై ఇరువురూ చర్చించారు. భేటీ అనంతరం కెన్నిత్ విల్స్ బాస్ మాట్లాడుతూ అమెరికా గగనతలంపై కలకలం సృష్టించినా చైనా బెలూన్ ను కూల్చివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆపరేషన్‌కు వివరాలను భారత్‌తో పంచుకున్నట్లు వెల్లడిరచారు. బెలూన్ కూల్చివేత విషయంలో పరిగణనలోకి తీసుకున్న అంశాలు, కూల్చివేత సందర్భంగా ఎదురైన సవాళ్లు, బెలూన్‌లో మనుషులు ఉంటే తీసుకోవాలనుకున్న చర్యల గురించి భారత అధికారులకు సంక్షిప్తంగా వివరించినట్లు ఆయన తెలిపారు.













