హ్యూస్టన్‌లోని పోస్టాఫీస్ కు సందీప్ సింగ్ ధలివాల్ పేరు
అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిక్కు వ్యక్తి, పోలీస్ ఆఫీసర్ సందీప్ సింగ్ ధలివాల్‌ను గౌరవిస్తూ, ఓ పోస్టాఫీస్‌కు ధలివాల్ పేరును పెట్టారు. దీనికి సంబంధించిన బిల్లును అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్‌లోని పోస్టాఫీసును ‘డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్ట్ ఆఫీస్ భవనం’గా మార్చడానికి యూఎస్ ప్రతినిధుల సభ సెప్టెంబరులో ద్వైపాక్షిక చట్టాన్ని ఆమోదించింది. ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్ చేరింది. ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ బిల్లు చట్టంగా మారుతుంది. కాగా, ఈ గౌరవం దక్కించుకున్న రెండో భారతీయ వ్యక్తి ధలివాల్. అంతకుముందు అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు దలిప్ సింగ్ సౌంద్కు 2006లో ఈ గౌరవం దక్కింది. సౌత్ కాలిఫోర్నియాలోని ఓ పోస్టాఫీస్‌కు దలిప్ సింగ్ పేరు పెట్టారు.













