అమెరికా, బ్రిటన్ మధ్య టీ చిచ్చు!
వేడి వేడి టీ అద్భుతమైన రుచిగా ఉండాలంటే కాసింత ఉప్పు వేయాలని బ్రిన్ మావ్ర్ కాలేజ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ మిషెల్లీ ఫ్రాంక్ల్ ఇచ్చిన సలహా అమెరికా, బ్రిటన్ మధ్య వివాదాన్ని రేపింది. టీ బ్రిటన్ జాతీయ పానీయం కావడంతో ఆ దేశంతో సత్సంబంధాలు దెబ్బతింటాయేమోనని అమెరికా ఆందోళనకు గురైంది. వెంటనే లండన్‌లోని అమెరికన్ ఎంబసీ రంగంలోకి దిగింది. అమెరికన్ ప్రొఫెసర్ ఒకరు పర్ఫెక్ట్ టీ కోసం ఇచ్చిన సలహా బ్రిటన్‌తో తమకు గల ప్రత్యేక బంధాన్ని సల సల కాగుతున్న నీళ్లలో పడేసిందని వ్యాఖ్యానించింది. టీలో ఉప్పు కలపడం అమెరికాలో అధికారిక విధానం కాదని స్పష్టం చేసింది. టీని మైక్రోవే వింగ్ చేసి, సరైన రీతిలోనే తయారు చేస్తామని తెలిపింది.













