అమెరికా ప్రతికార వేట మొదలైంది… సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు
కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. కాబూల్‌లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగహార్ ప్రావిన్స్ లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడి చేశామని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వెలుపల నుంచి ఈ దాడి జరిపినట్లు చెప్పారు. ఈ దాడుల్లో జంట పేలుళ్ల సూత్రధారిని మట్టబెట్టినట్లు సమాచారం. ఐసిస్-కే గ్రూపు లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా దళాలు ప్రకటించుకున్నాయి. కాబూల్ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతి చెందాడు.













