రష్యా దౌత్యవేత్తలకు అమెరికా హుకూం…
రష్యాన్ దౌత్తవేత్తలను తమ దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా అమెరికా హుకూం జారీ చేసింది. 24 మంది రష్యాకు చెందిన దౌత్యవేత్తలు వచ్చే నెల 3వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. వీసా గడువు ముగిసినందున వీరిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు అమెరికా కారణాలు వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికాలోని రష్యన్ అంబాసిడర్ అనాటోలీ ఆంటోనోవ్ ధ్రువీకరించారు. తమ దేశ దౌత్యవేత్తల వీసాల గడువు ముగిసినందున వారికి ఆర్డర్ ఇవ్వబడిందని, వీరందరూ సెప్టెంబర్ 3 నాటికి అమెరికా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు అందినట్లు ఆయన వెల్లడించారు.













