హెచ్ 1బీ వీసాలపై… కీలక ప్రకటన
2023 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్ 1బీ వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో కంపెనీలు వృతి నిపుణులు పోస్టుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు వీలుగా నాన్ ఇమిగ్రెంట్ విధానంలో ఈ వీసాలను జారీ చేస్తుంది. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఎక్కువగా ఆధారపడి ఉద్యోగులను నియమించుకొంటాయి. విదేశీ వృత్తి నిపుణుల్లో వర్క్ వీసా తర్వాత అత్యంత ఆదరణ ఉన్న వీసా ఇదే. అమెరికా కాంగ్రెస్ నుంచి 65,000 హెచ్1 బీ వీసాల మార్కును చేరుకొనేందుకు తగినన్ని దరఖాస్తులు వచ్చాయి. దీంతో పాటు అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కింద జారీ చేసే 20,000 హెచ్1 బీ వీసాలకు కూడా 2023 ఆర్థిక సంవత్సరానికి తగినన్ని ఆఫ్లికేషన్లు వచ్చాయి అని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. నమోదుదారుల ఆన్లైన్ చిరునామాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపినట్లు పేర్కొంది. ఎంపిక కాని వారికి నాట్ సెలెక్టెడ్ అని సందేశం వస్తుందని తెలిపింది.













