సమస్యల పరిష్కారంలో భారత్ ది కీలక పాత్ర : అమెరికా
భారత్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది. పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నదని అమెరికా వెల్లడించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసుకున్నదని అమెరికా ఎంబసీ తెలిపింది. అమెరికాకు చెందిన దౌత్య అధికారి జాన్ కెర్రీ భారత్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు భారత పర్యటనలో ఉండనున్న జాన్‌కెర్రీ, భారత ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్లతోనూ భేటీ కానున్నారు.
పర్యావరణ మార్పుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలిసి అడుగేయడంపై జాన్ సంప్రదింపులు జరపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలతో చర్యలు జరపనున్నారు. ఈ నెల 22-23వ తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యావరణ సదస్సును నిర్వహించనున్న సంగతి తెలిసిందే.













