అమెరికా జనాభా.. ఎంతో తెలుసా?

అమెరికా జనాభా 2020 లెక్కల వివరాలు వెలువడ్డాయి. సెన్సస్ బ్యూరో వెలువరించిన వివరాల ప్రకారం ఏప్రిల్ నాటికి దేశ జనాభా 33,14,49,281గా ఉంది. 2010 కన్నా 7.4శాతం మంది పెరిగారు. 1930 తర్వాత ఇంత నెమ్మదిగా పెరగుదల నమోదవడం దేశ చరిత్రలోనే రెండవసారి అని జనగణన అధికారులు తెలిపారు. అమెరికాలో ప్రతి పదేళ్లకు ఒక్కసారి జనాభా లెక్కలు, ఇతర గణాంకాలు విడుదలవుతుంటాయి. గతేడాది డిసెంబరు 31 నాటికే ఈ నివేదిక వెలువడాల్సి ఉంది. కరోనా కారణంగా ఆలస్యమైనట్లు తెలిపారు.