అమెరికాకి ముందే తెలుసు … కానీ
రష్యాపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తారని అమెరికా నిఘా వర్గాలు ముందే పసిపగట్టాయి. జూన్ మధ్యలో ప్రిగోజిన్ రష్యాపై తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా సంస్థలకు సమాచారం అందింది. వారం క్రితం నిర్ధారణగా తెలిసింది. తిరుగుబాటుకు ఒక్క రోజు ముందే రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అమెరికా ప్రభుత్వానికి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. పుతిన్‌కు ఒకరోజు ముందే తిరుగుబాటు విషయం తెలుసని అమెరికా పేర్కొంది. రష్యాలో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలతో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. తమ మద్దతు ఎప్పటికీ ఉక్రెయిన్‌కే ఉంటుందని పునరుద్ఘాటించారు. రష్యాలో తిరుగుబాటు జరిగినంత మాత్రాన తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు.













