అమెరికా ఉపాధ్యక్షురాలును చంపేస్తామన్న నర్సు అరెస్టు…
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. కమలా హారిస్ గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో 13-18 తేదీల మధ్య కమలా హారిస్‌ను చంపుతానని, శారీరకంగా దాడి చేస్తానని ఫ్లోరిడాకు చెందిన నర్సు నివియానె పెటిట్ ఫెల్పస్ పలుసార్లు బెదిరింపులకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదవగా, యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు అనంతరం ఫెల్పస్ ను పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్‌లో పని చేస్తోంది.













