అమెరికాలో ప్రమాదం .. సముద్రంలోకి దూసుకెళ్లిన
అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ విమానం రన్‌వేపై అదుపు తప్పి ఏకంగా సముద్రం (కన్యోహి బే) లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరీన్ కోర్ బేస్ లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆ కోర్ ప్రతినిధి ఆర్లాండో పెరేజ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో ఆ విమానంలోని తొమ్మిది మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు స్వల్పంగా గాయపడ్డారు.













