తమను అమెరికాలోనే ఉండనివ్వండి…

భారతీయ సంతతి యువతీ, యువకులు తమను అమెరికాలోనే ఉండనివ్వాలని ఆ దేశ చట్టసభ సభ్యులను, ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. తల్లిదండ్రులతో పాటు చిన్నతనంలో అమెరికాకు వచ్చిన వీరిని డ్రీమర్లు అని అంటారు. 21 ఏండ్లు వయసు దాటిన తర్వాత వీళ్లు తల్లిదండ్రుల వీసాలపై ఆధారపడి ఉండరు కాట్టి వారిని వారి స్వదేశాలకు పంపించాలని అమెరికా చట్టాలు పేర్కొంటున్నాయి. అయితే, ఒబామా హయాంలో దీనిని నిలిపివేస్తూ డ్రీమర్లకు అనుకూలంగా ఒక చట్టాం తెచ్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్ హయాంలో దానిని రద్దు చేశారు. దీంతో 21 ఏండ్లు దాటిన దాదాపు 2 లక్షల మంది డ్రీమర్లు అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.