రికార్డు స్థాయిలో వీసాలు జారీ : అమెరికా
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం సైతం డిమాండుకు తగినట్లుగా వీసాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో చదువు కోసం ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌లోనే ఉంటుందని తెలిపింది. ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్‌వర్క్, సాంకేతికత సహాయంతో అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.













