భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో… వీసాలు
భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. 2022 సంవత్సరానికి 82 వేల స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు ఇండియాలోని యూఎస్ మిషన్ వెల్లడించింది. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో 20 శాతం మంది భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులకు వీసాలు అందడం సంతోషకరంగా ఉందని అమెరికా అధికారి పాట్రేసియా లాసినా పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో సుమారు 82 వేల స్టూడెంట్ వీసాలను జారీ చేసినట్లు తెలిపారు. న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో స్టూడెంట్ వీసాలకు ప్రాసెసింగ్ జరిగినట్లు పాట్రేసియా తెలిపారు.













