భారతీయ విద్యార్థులకు 82 వేల వీసాలు
భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలను మంజూరు చేసినట్టు అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో మరే దేశానికి అమెరికా స్టూడెంట్ వీసాలను మంజూరు చేయలేదన్నారు. ఆమె హైదరాబాద్లోని యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ను సందర్శించి అక్కడి వైయాక్సిస్ ఫౌండేషన్ సీఈవో జేవియర్ ఆగస్టీవ్, సీవోవో సబినా జేవియర్తో సమావేశమయ్యారు. 2021`22 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికాను ఎంచుకున్నారని, ఇది గతంతో పోల్చితే 19 శాతం అధికమని తెలిపారు.













