ఉక్రెయిన్‌కు అధునాత రాకెట్ వ్యవస్థలు
అత్యంత అధునాతనమైన, మధ్యస్థ శ్రేణి రాకెట్ వ్యవస్థలను స్వల్ప సంఖ్యలో ఉక్రెయిన్‌కు పంపనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ దళాల పురోగతిని అడ్డుకోవడానికి ఉక్రెయినియన్ లు పోరాటాన్ని జరుపుతున్నాయి. ఈ యుద్ధానికి ఆజ్యం పోసేలా అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఉక్రెయిన్‌కు ఆధునాతన ఆయుధాలను అందజేస్తున్నాయి. 70 కోట్ల డాలర్ల విలువ చేసే భద్రతా సాయాన్ని ఉక్రెయిన్‌కు పంపుతామని అమెరికా ఇంతకు ముందు ప్రకటించింది. అందులో భాగంగా హెలికాప్టర్లు, జావెలిన్ ట్యాంక్ విధ్వంసక ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక ఆయుధాలు, విడిభాగాలు, పైన చెప్పిన రాకెట్ వ్యవస్థలు ఇవన్నీ వున్నాయని అధికారులు తెలిపారు.













