ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సాయం!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో రష్యా, సైనిక జనరల్స్ అంతం కావడంలో అమెరికా హస్తం ఉందా? అమెరికా అందించిన కీలక నిఘా సమాచారంతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యా జనరల్స్‌ను మట్టుబెట్టిందా? అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ పత్రిక. రష్యా, సైనికాధికారులపై దాడి చేయడంలో ఉక్రెయిన్‌కు నిఘా సమాచారం చేరవేడయం వాస్తవమేనని సదరు అధికారులు అంగీకరించారు. అమెరికాతో పాటు బ్రిటన్, ఇతర నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న సంగతి బహిరంగ రహస్యమేనని రష్యా ఉద్ఘాటించింది. ఎవరు ఎన్ని విధాలుగా అండగా నిలిచినా తమ లక్ష్యం సాధించి తీరుతామని పేర్కొంది. యుద్దరంగంలోని 12 మంది రష్యా జనరల్స్‌ను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.













