కరోనా కోసం… యూఎస్ఐసీఓసీ ఫౌండేషన్ సాయం

భారత్‍లో కొవిడ్ కట్టడి చర్యల కోసం అమెరికా-ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్‍ఐసీఓసీ) ఫౌండేషన్ 12 లక్షల డాలర్ల (దాదాపు రూ.8.76 కోట్లు) మేర సమీకరించింది. ఈ మేరకు దాదాపు 120 వెంటిలేటర్లను, వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‍కు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రెసిడెంట్ నీల్ గొనుగుంట్ల తెలిపారు.