భారతీయులకు అమెరికా శుభవార్త.
భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారతీయుల విద్యార్థి వీసాలు అన్నింటినీ ప్రాపెస్ చేసేలా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కట్టుబడి ఉందని, దక్షిణ, మధ్య ఆసియాకు సంబంధించిన అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ తెలిపారు. భారతదేశానికి చెందిన ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునే వర్క్ వీసాలు, హెచ్1 బీ, ఎల్ వీసాలకు కూడా అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. మేము ఈ సంవత్సరం మిలియన్ కంటే ఎక్కువ వీసాలు జారీ చేయడానికి పని చేస్తున్నాం. విద్యార్థుల వీసాలు, వలస వీసాల సంఖ్యతో పాటు ఇది మాకు ఒక రికార్డు అని డొనాల్డ్ లూ పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. మేము వర్క్ వీసాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాము, హెచ్-1బి, ఎల్ వీసాలు, ఈ వీసాల కోసం భారతదేశంలోని మా కాన్సులర్ విభాగాలలో కొన్ని వేచి ఉండే సమయాలు ఇప్పుడు 60 రోజుల కంటే తక్కువగా సమయం పడుతుంది అని తెలిపారు.













