ఆ దేశంలో దౌత్య కార్యకలాపాలు నిలిపివేసిన అమెరికా
సూడాన్ నుంచి తమ దౌత్య సిబ్బంది 70 మందిని స్వదేశానికి తరలించినట్లు అమెరికా ప్రకటించింది. తాత్కాలికంగా ఆ దేశంలో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్, గ్రీస్, నెదర్లాండ్స్, ఇటలీ తదితర దేశాలు తమ దౌత్య సిబ్బందిని, ప్రజల్ని స్వదేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. సూడాన్‌లో ఘర్షణలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బాంబుదాడులతో నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఘర్షణల్లో ఇప్పటివరకు 420 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 3,700 గాయాలపాలైనట్లు భావిస్తున్నారు. అన్నింటికీ తెగించి ప్రమాదకరమైన రహదారులపై ప్రయాణించి గానీ, ఈజిప్టులోని ప్రవేశించిగానీ ప్రాణాలు కాపాడుకునేందుకు అనేకమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వేలసంఖ్యలో ప్రజలు వలస వెళ్లిపోయారు.













