స్టూడెంట్ వీసా డే సందర్భంగా.. ఒకేరోజు 2,500 మందికి
దేశంలోని అమెరికా కాన్సులేట్లలో ఒకేరోజు 2,500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు చేసినట్టు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. స్టూడెంట్ వీసా ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లో తమ అధికారులు భారత విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు హైదరాబాద్ కాన్సులేట్ తెలిపింది. ఈ ఇంటర్వ్యూల్లో వీసాలు పొందిన విద్యార్థులకు చార్జ్ డీ అఫైర్స్ పాట్రీషియా లాసినా, కాన్సుల్ జనరల్స్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తూ అమెరకా-ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో 75 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు లాసినా గుర్తు చేశారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారిలో భారతీయ విద్యార్థుల వాటా 20 శాతం ఉంటుందని, సంఖ్యా పరంగా 2 లక్షల మందికి పైగా ఉన్నారని కాన్సులేట్ పేర్కొంది.













