శుభవార్త వార్త.. ఆంక్షలు సడలించిన అమెరికా
భారతదేశానికి ప్రయాణాల ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా సడలించింది. భారత్‌ను సురక్షిత దేశంగా పరిగణిస్తూ గతంలో లెవల్ 4లో ఉన్న ట్రావెల్ అడ్వయిజరీ లెవల్ 2 కిందకు మారుస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌డీఏ అధికారికంగా గుర్తించిన వ్యాక్సిన్ సంపూర్ణంగా వేసుకున్న వారు భారత్‌కు ప్రయాణిస్తే కొవిడ్ సోకే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా ఉత్తర్వులో తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలు, అంతర్ ఘర్షణలు చెలరేగుతున్న జమ్మూ కశ్మీరుకు మాత్రం ప్రయాణించవద్దని అమెరికన్ పౌరులకు విదేశాంగ శాఖ కోరింది. సాయుధ ఘర్షణలు జరగడానికి అవకాశం ఉన్న భారత్ పాకిస్తాన్ సరిహద్దులకు చెందిన 10 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లవద్దని అమెరికా తన పౌరులను ఆదేశించింది.













