ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణం : ఏంజెలా మెర్కెల్
ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని జర్మని చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ విమర్శించింది. అగ్రరాజ్యం బలగాలను వెనక్కి తీసుకెళ్లడం వల్లే ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందని ఆమె అన్నారు. ఆ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంలో కొంత అమెరికా దేశీయ రాజకీయాల పాత్ర కూడా ఉన్నదని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన 10 వేల మందిని తరలించే ప్రయత్నం చేయనున్నట్లు మెర్కెల్ తెలిపారు. వీళ్లలో 2500 మంది ఆఫ్ఘన్ సపోర్ట్ స్టాఫ్ కాగా, హక్కుల కార్యకర్తలు, లాయర్లు, ఇతరులు ఉన్నారు.













