రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా.. తాము అలాంటి పనులేం
ఉక్రెయిన్లో అమెరికా అక్రమంగా రసాయన ఆయుధాలను అభివృద్ధి చేస్తోందన్న రష్యా ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం కొట్టిపారేసింది. తాము అలాంటి పనులేం చేయట్లేదని స్పష్టం చేసింది. రష్యా వ్యాఖ్యలు చూస్తుంటే మున్ముందు ఉక్రెయిన్పై జీవ, రసాయన ఆయుధాలతో ఆ దేశమే దాడి చేసేలా కనిపిస్తోందని హెచ్చరించింది. వాళ్ల దాడులను సమర్థించుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. జీవ, రసాయన ఆయుధాలను ఉక్రెయిన్ తమ భూభాగంలో అమెరికా సాయంతో అభివృద్ధి చేస్తోందని ఆధారాలు చూపించకుండా రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే.













