ఇరాన్ ప్రకటనను ఖండించిన అమెరికా

ఖైదీల విడుదలపై అమెరికా, బ్రిటన్‍లతో తమ దేశం కీలక అవగాహన కుదుర్చుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం ఆయా దేశాలతో సంబంధాలున్న ఖైదీలను ఇరాన్ విడుదల చేస్తుందని తెలిపింది. ఇందుకు బదులుగా వందల కోట్ల డాలర్లను అమెరికా, బ్రిటన్‍లు విడుదల చేస్తాయని వెల్లడించింది. 700 కోట్ల డాలర్లను విడుదల చేయడానికి, నలుగురు ఇరాన్ వాసులకు మాకు అప్పగించడానికి అమెరికా అంగీకరించింది. ప్రతిగా నలుగురు అమెరికా గూఢచారులను విడుదల చేస్తాం అని పేర్కొంది. బ్రిటీష్-ఇరాన్ మహిళ నెజానిన్ జాఘారి-రాట్‍క్లిఫ్ విడుదలకు బదులుగా 40 కోట్ల పౌండ్లను చెల్లించేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు తెలిపింది. అయితే దీనిని అమెరికా ఖండించింది. బ్రిటన్ మాత్రం దీనిపై స్పందించలేదు.