ఆఫ్ఘన్ లో అమెరికా విదేశాంగ మంత్రి అకస్మిక పర్యటన!
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆకస్మికంగా ఆఫ్ఘనిస్థాన్‌ను సందర్శించారు. గతేడాది తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం మేరకు అమెరికా సైనిక బలగాలు కొన్ని వారాల్లో ఆఫ్ఘన్‌ను వీడనున్న నేపథ్యంలో ఆస్టిన్ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించిన డెడ్‌లైన్ ప్రకారం వచ్చే మే ఒకటో తేదీ నాటికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలు వైదొలుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గడువు దాటిన తర్వాత పాశ్చాత్య దేశాల సైన్యం తమ దేశంలో ఉంటే, తలెత్తే తీవ్ర పరిణామాలకు అమెరికాదే బాధ్యత అని ఉగ్రవాదులు ఇప్పటికే ప్రకటించారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం బలగాలను తమ దేశంలోనే కొనసాగించాలని ఆఫ్ఘనిస్థాన్ సర్కార్ భావిస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీతో చర్చల తర్వాత సైనం వైదొలగడానికి గడువుపై స్పందించడానికి ఆస్టిన్ నిరాకరించారు. ఈ అంశం తమ అధ్యక్షుడు బైడెన్ పరిధిలోని అంశం అని దాటేశారు. దీనిపై నిర్ణయాధికారం బైడెన్దేనని పేర్కొన్నారు.













