అమెరికన్ లే మాకు ముఖ్యం.. ఆంక్షలు ఎత్తివేయలేం
కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన కీలకమైన ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన ఆంక్షలను అమెరికా సమర్ధించుకుంది. ఆ ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా వ్యాక్సిన్ తయారీకి విస్త•తంగా ముడి పదార్ధాలను అందుబాటులో ఉంచాలన్న భారత్ విజ్ఞప్తిపై అమెరికా హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ మా ప్రయోజనాలకే మాకు ముఖ్యం. అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది అని అన్నారు. ఎగుమతులకు సంబంధించిన ఆంక్షలపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా కంపెనీలు దేశీయ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ఇక్కడి చట్టం. అందువల్లే తక్కువ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగాం అని అన్నారు.













