భారత్ కోసం జో బైడెన్ కు… అమెరికా నేతల విజ్ఞప్తి

కరోనాతో అతలాకుతలమవుతున్న భారత్‍ను ఆదుకోవటానికి అమెరికా మరింత సాయం చేయాలని ఆ దేశానికి చెందిన పలువురు చట్టసభల సభ్యులు అధ్యక్షుడు జో బైడెన్‍కు విజ్ఞప్తి చేశారు. వీరిలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబొట్, రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్, సెనేటర్ రోగర్ వికర్ తదితరులున్నారు.