అతిగా వ్యవహరిస్తే… ఆ దేశాన్ని చితకబాదుడే
స్వాతంత్య్రం ప్రకటించుకుంటే తైవాన్‌పై యుద్ధానికి వెనుకాడేది లేదని చైనా హెచ్చరించింది. చైనా రక్షణ మంత్రి జనరల్ వీఫెంఘే, అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ మధ్య తొలి ముఖాముఖి భేటీ సందర్భంగా తైవాన్ ప్రస్తావనకు వచ్చింది. తైవాన్ అతిగా వ్యవహరిస్తే ఆ దేశాన్ని చితకబాదుడే అని రక్షణ మంత్రి స్పందించారని వెల్లడైంది. తైవాన్ స్వాతంత్య్రం దిశలో ఎటువంటి చర్యకు పాల్పడ్డా తమ ప్రతి చర్య తప్పదని, ఇది తీవ్రంగా ఉంటుందని చైనా తెలిపింది. తైవాన్ చైనాకు చెందిన తైవాన్. తమ మాతృభూమి పునరేకీకరణను పరరిక్షించుకుని తీరుతాం అన్నారు. తైవాన్ను తురువు ముక్కగా వాడుకుని చైనాను నిలువరించాలనుకుంటే ఆ పప్పులు ఎవరికైనా ఉడకవని అమెరికా, జపాన్‌లకు చురకలు పెట్టారు.













