అమెరికాలో భారత సంతతి ఇంజినీర్ లకు విముక్తి
కుల వివక్ష కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరు ఇంజినీర్లకు విముక్తి లభించింది. ఈ మేరకు అమెరికాలోని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగం ( సీఆర్డీ) తీర్పు చెప్పింది. సిస్కోలో తమతో పాటు పని చేస్తున్న ఉద్యోగిని కులం పేరుతో దూషించినందుకు సుందర్ అయ్యర్, రమణ కొంపెల్లలపై కేసు నమోదైంది. తాను దళితుడినని ప్రకటించుకున్న జాన్ డో ఈ ఫిర్యాదు చేశారు. మూడే ళ్ల కిందట నమోదైన ఈ కేసు కారణంగా ఈ ఇద్దరు భారత సంతతి ఇంజీనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మతం, జాతీయత ఆధారంగా భారతీయ అమెరికన్లపై అభియోగాలను మోపడానికి వీల్లేదంటూ సీఆర్డీ అభిప్రాయపడి కేసును కొట్టేసిందని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు సుహాగ్ శుక్లా పేర్కొన్నారు.













