అమెరికా నిర్ణయం… ప్రపంచ దేశాలకు

కరోనా వైరస్ కట్టడికి టీకానే ప్రధాన ఆయుధంగా అందరూ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన టీకా మేధో సంపత్తి హక్కుల రద్దుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా మద్దతు తెలిపింది. మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు మద్దతునిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రేడ్ ప్రతినిథి కేథరిన్ తెలిపారు. మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కానీ వైరస్ అంతానికి కరోనా టీకాలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రద్దు చేసేందుకు అమెరికా మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరేందుకు సమయం పడుతుందని కేథరిన్ తెలిపారు. ప్రస్తుతం టీకా మేధో సంపత్తి హక్కుల రద్దుకు అమెరికా మద్దతు తెలుపడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే, అమెరికా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రశంసించారు. నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు.