పశ్చిమాసియాలో అమెరికా బాంబర్ల బలప్రదర్శన
పశ్చిమాసియాలో ప్రత్యర్థులకు హెచ్చరికగా బలప్రదర్వన చేయడానికి అణ్వస్త్ర వాహక సామర్థ్యం గల రెండు దూరశ్రేణి బి-52 బాంబర్ విమానాలను పంపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇంగ్లాండ్ నుంచి బయలుదేరిన ఈ విమానాలు తూర్పు మధ్యధరా సముద్రం, అరేబియా ద్వీపకల్పం, ఎర్ర సముద్రం మీదుగా పయనించి సౌదీ, కువైట్ విమానాలతో సంయుక్తంగా శిక్షణ విన్యాసాలు నిర్వహించాయి. మార్గమధ్యంలో ఇజ్రాయెల్ గగనతలంలోబి`52 బాంబర్లు పయనించేటప్పుడు మూడు ఇజ్రాయెలీ ఎఫ్-16 ఫైటర్ జెట్లు తోడుగా వెళ్లాయి. గత ఏడాది అమెరికా సెంట్రల్ కమాండ్లో ఇజ్రాయెల్ కూడా చేరింది. తన ప్రత్యర్థి ఇరాన్ను ఉద్దేశించి బలప్రదర్శన చేపట్టినట్లు అమెరికా ప్రకటించకపోవయినా ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.













