ల్యాబ్ చికెన్ కు అమెరికా ఆమోదం
తమ దేశంలో ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను అమ్మేందుకు అమెరికా ఎఫ్‌డీఏ తొలిసారిగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మూల కణాలతో చికెన్‌ను అభివృద్ధి చేస్తున్న అప్‌సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు మాంసాన్ని అమ్మేందుకు అనుమతులు మంజూరు చేసింది. నవంబరులోనే ఆయా కంపెనీలను సందర్శించిన ఎఫ్‌డీఐ అక్కడి నాణ్యతా ప్రమాణాలు, తయారీ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించింది. గత వారం కంపెనీల ఉత్పత్తులపై మరోసారి సమీక్షించిన అనంతరం ఎఫ్‌డీఏ సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఈ చికెన్ మార్కెట్లోకి రానుంది. కాగా, ఈజ్ జస్ట్ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా 2020లో సింగపూర్‌లో కృత్రిమ మాంసాన్ని అమ్మేందుకు అనుమతులు తీసుకుంది. తాజాగా ఈ రంగంలోకి ప్రవేశించిన రెండో దేశంగా అమెరికా నిలిచింది.













