భారత్ కు అగ్రరాజ్యం మరోసారి.. భారీ సాయం

కరోనాతో సతమతమవుతున్న భారత్‍కు అగ్రరాజ్యం మరోసారి భారీ సాయం ప్రకటించింది. భారత్‍కు అదనంగా మరో 41 మిలియన్ల డాలర్ల (రూ.304.50 కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కోవిడ్‍ను ఎదుర్కొనేందుకు ఆ సాయాన్ని వినియోగించనున్నారు. ఇప్పటి వరకు అమెరికా 200 మిలియన్ల డాలర్ల విలువైన సహాయాన్ని అందించింది. గతంలో భారత్ తమకు తోడుగా నిలిచిందని, ఇప్పుడు కష్ట సమయాల్లో ఉన్న ఆ దేశాన్ని తాము ఆదుకోబోతున్నట్లు అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‍మెంట్ ఏజెన్సీ పేర్కొన్నది. భారత్‍లో కొవిడ్ టెస్టింగ్, మెంటల్ హెల్త్ సర్వీస్, మెడికల్ సర్వీస్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం ఈ సాయం చేస్తున్నట్లు తెలియజేసింది.