రష్యాకు షాక్.. వైదొలిగిన అమెరికా రాయబారి
రష్యా నుంచి అమెరికా రాయబారి జాన్ సుల్లివన్ వైదొలిగారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ఇది కీలక నిర్ణయంగా నిపుణులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గేంతవరకు జాన్ సుల్లివన్ తాత్కాలికంగా అమెరికాలో ఉంటారని రాయబార కార్యాలయం ప్రకటించింది. గత వారం జో బైడెన్ ప్రభుత్వం 10 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రష్యాలోని మూడు డజన్లకు పైగా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదని, ఫెడరల్ ఏజెన్సీల ఉల్లంఘన వెనుక మాస్కో హస్తం ఉన్నదని రష్యాపై ఆరోపణలు వచ్చాయి.













