మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్న అమెరికా
విశ్వ క్రీడల్లో మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్న అమెరికా టోక్యో ఒలింపిక్స్ ను టాప్ ర్యాంక్‌తో ముగించింది. పోటీల చివరి రోజు వరకు అమెరికా స్వర్ణాల సంఖ్యలో చైనాకంటే రెండు పతకాలు వెనుకంజలో ఉంది. అయితే ఆఖరి రోజు అమెరికా మూడు పసిడి పతకాలు సాధించి చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. మహిళ వాలీబాల్‌లో తొలిసారి అమెరికాకు బంగారు పతకం లభించింది. మహిళల బాస్కెట్ బాల్లో అమెరికా జట్టు ఏడోసారి విజతేగా నిలిచింది. సైక్లింగ్ ఓమ్నియమ్ పాయింట్స్ రేసులో జెన్నిఫర్ వాలెంటి అమెరికాకు స్వర్ణాన్ని అందించింది. గత ఏడు ఒలింపిక్స్‌లో అమెరికా అగ్రస్థానంలో నిలవడం ఇది ఆరోసారి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో చైనా అమెరికా టాప్ ర్యాంక్‌లో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది.













