ఈ ఘటనలకు ఎవరు బాధ్యులు : యూఎన్ చీఫ్
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఉక్రెయిన్లో పర్యటించారు. రష్యా సేనల భీకర దాడులో విధ్వంసమయిన ప్రాంతాలను సందర్శించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాలలో కలియతిరిగిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందనే ఆరోపణలు తీవ్రతరం అవుతున్న దశలో ఐరాస అధినేత దెబ్బతిన్న ప్రాంతాలకు వచ్చారు. జెలెన్ స్కీతో సంప్రదింపులకు ముందు మాట్లాడుతూ జరిగిన ఘటనలకు ఎవరు జవాబుదారి వహిస్తారు? ఏ విధమైన సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దెబ్బతిన్న భనాలు శిథిలాలను చూస్తూ ఉంటే ఈ బాధితులలో తన కుటుంబం కూడా ఒకటిగా ఉన్నట్లు అన్పిస్తోందని, కాలిపోయిన స్థితిలో తన వారు ఉన్నట్లు తోస్తోందని భాధితులలో ఒకరిగా తన కూతుళ్లు పరుగులు తీస్తున్నట్లు కేకలు పెట్టినట్లు అన్పిస్తోందని అన్నారు.













