ఆ దేశం నుంచి ప్రతిపాదన వస్తే.. పరిశీలిస్తాం : ఐరాస
భారతదేశం పేరు మార్పునకు సంబంధించి ఆ దేశం నుంచి ప్రతిపాదన వస్తే ఐక్యరాజ్యసమితి పరిశీలిస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. టర్కీ పేరును గత ఏడాది తుర్కియేగా మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జీ20 సదస్సుకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభ్యుదేశాలకు పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిన నేపథ్యంలో ఇండియా పేరును భారత్‌గా మారుస్తున్నారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.













