వారి విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం
శరణార్థులను అక్కున చేర్చుకునే విషయంలో భారత్ చూపిస్తున్న చొరవ అత్యంత ప్రశంసనీయమని ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ గిల్లియాన్ ట్రిగ్స్ కొనియాడారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన గిల్లియాన్ నేషనల్ గాంధీ మ్యూజియంలో ఛర్ఖా ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ కారణాలతో స్వదేశాలను వదిలి పెట్టి వస్తున్న శరణార్థులకు సరిహద్దులు తెరిచి, భారత్ స్వాగతిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. వారిని గౌరవ ప్రదంగా చూస్తున్నారని తెలిపారు. టిబెటన్లు, శ్రీలంక తమిళలకు రక్షణ కల్పించడంలో భారత్ తీసుకున్న చొరవను కొనియాడారు.













