ఐరాస చీఫ్ గా మళ్లీ గుటెరస్?

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మరో పర్యాయం కొనసాగనున్నారు. గుటెరస్ అభ్యర్థిత్వాన్ని 15 మంది సభ్యులు గల భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదమే తరువాయి. 72 ఏళ్ల ఈ పోర్చుగల్ మాజీ ప్రధాని మరోసారి ఈ అత్యున్నత బాధ్యతలను చేపట్టనున్నారు. 2017లో మొదటి సారి గుటెరస్ ఈ బాధ్యతలను చేపట్టారు. 2022 నుంచి మరో అయిదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికోసం మరో పది మంది పోటీ పడాలని ప్రయత్నించినప్పటికీ, మండలిలో సభ్య దేశాలు గుటెరస్‍కే మొగ్గు చూపాయి.