మండలిలో మార్పులకు ఇదే అదను : గుటెరస్
ఐక్యరాజ్య సమితి లోని భద్రతా మండలి 1945 నాటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉందని, ప్రస్తుత కాల పరిస్థితులకు తగ్గట్టు దీనిని సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఐరాస ప్రదాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. జీ-7 సమావేశాల సందర్భంగా హిరోషిమాలో గుటెరస్ మీడియాతో మాట్లాడారు. కొవిడ్`19తో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, పర్యావరణ సమస్యలు, ఉక్రెయిన్పై రష్యా దాడి, నిలకడ లేని రుణా భారాలు, పెరుగుతున్న వడ్డీ ధరలు, తీవ్రమైన ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందిన, అభివృద్ధి దిశగా వెళుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నాం చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు అధికార సంబంధమైన కోణాలే కారణమని తెలిపారు.













