ఆమె మరణం భారత్ కు తీర్చలేని నష్టం : ఐరాస కార్యదర్శి
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లత మరణం భారత్కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరాస ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారణ వ్యక్తం చేశారు.













