ఐరాస ప్రధాన కార్యదర్శిగా మళ్లీ… గుటెరస్

ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గుటెరస్ రెండో పర్యాయం నియమితులయ్యారు. ఐరాసలో శక్తిమంతమైన భద్రతా మండలి సిఫారసు మేరకు జనరల్ అసెంబ్లీ ఆయన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్‍కిర్.. గుటెరస్‍తో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది జనవరి 1తో మొదలై 2026 డిసెంబర్ 31తో ఆయన పదవీకాలం ముగియనున్నది. గుటెరస్‍ను రెండోసారి నియమించాలంటూ ఈ నెల 8న భద్రతా మండలి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.