ఈ పద్ధతి మారకపోతే… మరో 300 ఏళ్లైనా అంతే !
ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను కాలరాస్తున్నారని, ఈ పద్ధతి మారకపోతే స్త్రీ-పురుష సమానత్వమనేది మరో 300 ఏళ్ల వరకూ సాధ్యం కాదని ఐక్యరాజ్యసమితి ప్రధానా కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల స్థితిగతులపై ఐరాస కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్త్రీ`పురుష సమానత్వంలో గడచిన కొన్ని దశాబ్దాల నుంచి సాధించిన ప్రగతి క్షీణిస్తోంది. పితృస్వామ్యం స్త్రీ`పురుష సమానత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆఫ్గానిస్థాన్‌లో ప్రజా జీవనం నుంచి మహిళలు, బాలికలను గెంటేస్తున్నారు. పలు దేశాల్లో మహిళల లైంగిక, గర్భదారణ హక్కులను హరిస్తున్నారు అని పేర్కొన్నారు. యుద్ధాలు, సంక్షోభావాలకు మొదట బలయ్యేది బాలికలు, మహిళలేని తెలిపారు.













